Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత మూడు వారాలుగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నే క్రిశాంక్ చేపడుతున్న బస్తీ నిద్ర కార్యక్రమాన్ని శనివారం రాత్రి కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు గాంధీ కాలనీలో చేశారు. ఇది 3వ బస్తీ నిద్ర కార్యక్రమం. అందులో భాగంగా స్థానికల నుంచి ప్రజా సమస్యలు తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది స్థానికులు పాల్గొని సమస్యలను క్రిశాంక్‌కు చెప్పారు. ప్రధానంగా - ఆలయ ప్రాంగణం దగ్గర భక్తులు పూజ, ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతించడం లేదని, జేఎన్ఎన్ యూఆర్ఎం హౌసింగ్ సొసైటీ ద్వారా నిర్మాణమైన ఈ ప్రాంతంలో 160 మంది స్థానికులకు విద్యుత్ శాఖ వారి పేరు మీద విద్యుత్ మీటర్లను ఇవ్వలేదని స్థానికులు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నుంచి ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని కూడా గాంధీనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిశాంక్ స్పందించి సమస్యలను సత్వరమే పరిష్కారం కోసం అధికారుల దష్టికి తీసుకుపోతామని తెలిపారు. అలాగే బస్తీలో శ్రీ శ్రీ కట్ట మైసమ్మ ఆలయ కమాన్ నిర్మాణం జరుగుతున్న దష్ట్యా తన వంతుగా సొంత నిధులు నుంచి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించి అక్కడే చెక్కు రాసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సి.రాజేందర్, ఎండి ఇస్మాయిల్, బీ ప్రభాకర్, సాయి, డీ విజయ్, ఏ హరిబాబు, నర్సింగ్ రావు, మోని, రఘు తదితరులు పాల్గొన్నారు.