Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జ్యోతిరావు ఫూలే సేవలు మరువలేనివని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఫూలే 197వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో బి .సి సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు అదనపు కలెక్టర్ ముఖ్యఅ తిథిగా హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ జ్యోతిరావుపూలే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆడ వాళ్ల్ల్లు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజం లో ఆడపిల్లలకు భరోసా ఉంటుందని భావించి ఆ రోజుల్లోనే స్త్రీ విద్య కోసం పాటుపడ్డారన్నారు. జ్యోతి బాపూలే తన భార్యను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేశారని గుర్తు చేశారు. మహాత్ముల జీవిత చరిత్రలను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడిస్తే మన జీవితాలకు సంతృప్తి కలుగుతుందని, వారి జీవిత ఆశయా లను నెరవేర్చడంలో నలుగురికి సహాయపడే అవకాశం కలుగుతుందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జాన్సీ రాణి, లా ఆఫీసర్ చంద్రావతి, కలెక్టరేట్ ఏఓ వెంకటే శ్వర్లు, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు వి. వెంకట నర్సయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బి. రమేష్ దారి, యం.బి.సి.సంఘం కన్వీనర్ యన్.భాస్కర్ ప్రజా పతి, జిల్లా బి.సి. ప్రతినిధులు, జిల్లా అధికారులు, బి.సి. సంక్షేమ వసతి గహాల అధికారులు, వెనుకబడిన తరగతుల అభివద్ధి శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.