Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు నిందితుల అరెస్టు
- రూ.30లక్షల విలువగల 80కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ (హెచ్-ఎన్ఈడబ్య్లూ) వింగ్ రట్టు చేసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు వారి నుంచి రూ.30లక్షల విలువగల 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పురాణాపూల్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డీసీపీ జీ.చక్రవర్తి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీ.పాండన్న, కే.సీతారామ్, కే.సుబ్బన్న, పీ.క్రిష్ణ మూర్తిల నుంచి వరంగల్‌కు చెందిన తేజావత్ కోటేష్ తక్కువ ధరలకు గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. 2018లో బస్సులల్లో గంజాయిని స్మగ్లింగ్ చేసేవాడు. 2022లో లారీని కొనుగోలు చేసిన నిందితు డు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌తోపాటు తదితర ప్రాంతాల్లో కావాల్సినవారికి, తెలిసిన వారికి గంజాయిని విక్రయిం చడం మొదలు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారంతో వినియోగదరాలు, సరఫరా దారులను సైతం అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన వారికి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు పీ.రాజేష్, ఏ.సుధాకర్, ఎస్ఐ డానియేల్ తదితరులు పాల్గొన్నారు.