Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పనిచేస్తుందని పాలకులు పదే పదే పేర్కొంటున్నా అవేమి తమకు పట్టవన్నట్టుగా మేడిపల్లి రెవెన్యూ అధికారులు తమ ప్రతాపాన్ని పేదలపై చూపిస్తున్నారని ఆరోపణలు వస్తు న్నాయి. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే 199లోని ప్రభుత్వ స్థలంలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం రేకులతో నిర్మించుకున్న ఇంటిని మరమ్మతుల కోసం పునర్: నిర్మించుకోగా దానిని బుధవారం మేడిపల్లి మండల రెవెన్యూ సిబ్బంది. పోలీసులు, జలమండలి అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. బాధితురాలు మహా బుబి, హూస్సేనీలు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఈడ్చి పడేశారని మీడియాకు వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మహాబుబీ మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకొని నివాసముంటున్నామని చెప్పారు. విద్యుత్ మీటర్ పొంది నల్లా కనెక్షన్ తీసుకోని నెల నెలా బిల్లులు చెల్లిస్తున్నం... వర్షాకాలంలో ఇల్లు కురుస్తుండడంతో నెల రోజులుగా మరమ్మ తులు చేసుకుంటున్నామన్నారు. ఈ విషయం పీర్జాదిగూడ రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకె ళ్లగా కట్టుకోవాలని చెప్పారని, ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత.. ఎలాంంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండ కూల్చివేయడం ఏమిటని, అందులోను ఒక దివ్యాంగురాలినైన తనపై అధికారులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణ దశలోనే ఎందుకు నివారించలేదు
ప్రభుత్వ భూముల్లో ఎకరాల కొద్ది ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న పేదలపై ప్రతాపం చూపడం వెసుక ఉన్న అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. దివ్యాంగురాలైన అభాగ్యురాలు పైసాపైసా కూడగట్టుకోని ఇల్లు కట్టుకుంటే అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి కూల్చివేయడంతో ఆ కుటుంబం రోడ్డుపాలైంది. అధికారులు ముందే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేస్తే పేదవారికి కనీసం పదిలక్షలైన మిగిలేవి కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.