Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ, రాంకీ మధ్య సమన్వయ లోపం..
- దుర్గానగర్లో కంపు కొడుతున్నా పట్టించుకోని సిబ్బంది
- చర్యలు తీసుకోవాలని స్థానికుల వినతి
నవతెలంగాణ -ఎల్బీనగర్
ఎల్బీనగర్లోని చైతన్యపురి డివిజన్ దుర్గా నగర్ మోడల్ బ్యాంక్ పక్కన 15 రోజులుగా చెత్త కుప్పలు ఎత్తడ ం లేదు. స్థానికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. కంపు కొడుతున్నా జిహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తు న్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. తొలగించే బాధ్యత మాది కాదు.. రోడ్లపై చెత్తను మాత్రమే తొలగిస్తాం. కుప్పలను తొలగించడం రాంకీ సంస్థ చూసుకుంటుంది అని చెబుతున్నారని తెలిసింది. జిహెచ్ఎంసి, రాంకీ మధ్య సమ న్వయ లోపంతో రోడ్లపై చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గతంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చెత్తకుప్పలను తొలగించేవారు నేడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుని పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.