Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
స్వాతంత్ర సమరయోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను దొడ్డి కొమరయ్య శిలా ఫలకం వద్ద ఘనంగా నిర్వహించినట్టు దొడ్డి కొమురయ్య కుమారుడు, దొడ్డి కొమురయ్య సేవా సమితి చైర్మన్ దొడ్డి నరహరి సోమవారం బషీర్ బాగ్‌లో విలేకరులకు తెలిపారు. ఈ నెల 15వ తేదీన తన తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం, పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తులో హాజరై విజయవంతం చేసిన చేర్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి దంపతులు, దొడ్డి కొమురయ్య అభిమానులు, స్థానిక యువకులు, మేధావులు, ప్రజలకు ఈ సందర్బంగా నరహరి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి దొడ్డి కొముర య్య భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో కలసి ప్రాణాలకు తెగించి పోరాటం చేశారనీ, ఆ క్రమంలో బుల్లెట్, రైఫిల్ దెబ్బలు, జైలు జీవి తం అనుభవించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి గోపికృష్ణ, దొడ్డి ప్రేమ్‌కుమార్, దొడ్డి శ్రీనివాస్, దొడ్డి దినేష్, కె.ఏడుకొండలు, సురేందర్ బెనర్జీ, న్యాయవాది కె.సురేష్, అరికంటి శ్రీనివాస్, సుద్దాల పద్మ, ఆవుల ఇందిర, సాయి కుమారి, తదితరులు పాల్గొన్నారు.