Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఏవీ పాఠశాలలో బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20ఏండ్ల జైలు
- షీటీమ్స్‌ను, కోర్టు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం వల్లా బాధితులకు న్యాయం జరిగింది. నేరస్తుడు జైలుపాల య్యాడు. అభంశుభం తెలియని ఎల్కేజీ చదువుతున్న ఐదేండ్ల చిన్నారిపై గత అక్టోబర్ మాసంలో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. బంజారా హిల్స్ రోడ్డు నం. 14లోని డీఏవీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేండ్ల బాలికపై అదే స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్(34) లైంగికదాడికి సంఘటన తెలిసిందే. బాధితుల నుంచి ఫిర్యాదును అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే పోక్సో కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలిం చారు. కేవలం 34రోజుల్లో 19 మంది సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. అప్పటి నుంచి నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగింది. పోక్సో కేసులో ఇరు పక్షాల వాదనలు, పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. నిందితుడు రజినీకుమార్‌ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.5000ల జరిమానా విధించింది. తప్పుచేసిన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా ఉండాలని షీ బృందాలు, బంజారాహిల్స్ పోలీసులు పక్కాగా సాక్ష్యాలను సేకరించి కోర్టులో సమర్పిం చారు. నిందితునికి శిక్షపడడంలో పూర్తిగా బాధితులకు చేయూతనందించారు. షీ బృందాలు, భరోసా టీమ్స్‌లు బాధితులకు కౌన్సిలింగ్ చేసి, వారిలో ధైర్యాన్ని నింపారు. ఇదిలావుండగా మంగళవారం డ్రైవర్ రజినీకుమార్కు జైలు శిక్షపడడంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో పోలీస్‌శాఖ ప్రతిష్టతను మరింత పెంచడంతో సీపీ సీవీ ఆనంద్.. కోర్టు సిబ్బందిని, షీ బృందాలను, భరోసా బృందాలతోపాటు బంజారాహిల్స్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం బంజారాహి ల్స్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ జోయేల్ డేవిస్, డీసీపీ శిరిషా రాఘవేంద్రతోపాటు తదితరులు పాల్గొన్నారు.