Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేను కోరిన కాలనీవాసులు
నవతెలంగాణ-హయత్ నగర్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో వివేకానంద నగర్ పేస్ 2 కాలనీలో డ్రయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మంగళవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అక్కడ ఉన్న మ్యాన్ హౌల్స్ కూలిపోవడం వల్ల భూగర్భ జలాలు డ్రైనేజీతో కలుషితం అవుతున్నాయని, దానివల్ల అన్ని అపార్ట్మెంట్లలో బోర్ వెల్ నందు కలుషిత నీరు వచ్చిందని తెలిపారు. ఆ డ్రైనేజీని తాత్కాలికంగా హాస్టల్ పక్క నుంచి మళ్లించా మన్నారు. అయినా లోపల లీకేజీలు అవుతున్నాయని తెలిపారు. వెంటనే ఎల్.బి.నగర్ సర్కిల్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్‌తో మాట్లాడారు. మరమ్మతులకు గురైన యూజీడీ పైప్‌లైన్స్ స్థానంలో కొత్తవి వేయాలని ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో పని పూర్తవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ మాట్లాడుతూ.. ఆ పైప్ లైన్స్ దాదాపు18 ఫీట్ల మేర కింద.. డ్రైనేజీ పైప్ లైన్స్ ఉండడం వల్ల కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు. రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్స్ పనులు చేయిస్తామని కాలనీవాసులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ పేస్ 2 అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.