Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్
నవతెలంగాణ - మీర్పేట్
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు, మీర్పేట్ కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో నిబద్ధతతో ప్రజల కోసం పని చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తన తల్లి వయస్సులో ఉన్న ఒక మహిళపై వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులు 24గంటల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల సబితమ్మ అభిమానులు, బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహావేశాలకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మీర్పేట్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, తుక్కుగుడ అధ్యక్షుడు రాజు, కందుకూరు యువజన విభాగం నాయకులు కార్తీక్, దీక్షిత్, ప్రవీణ్ రెడ్డి, హరీష్, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.