Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగార్జున విద్యాసంస్థల వైస్ చైర్మెన్
గుమ్మకొండ రజనీ విట్టల్ రెడ్డి
నవతెలంగాణ - హస్తినాపురం
విద్యార్థులకు పాఠశాలల పట్ల మక్కువ పెంచే విధంగా నాగార్జున విద్యాసంస్థలు ఎన్నో రకాల సాంస్కతిక కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామని నాగార్జున విద్యాసంస్థల వైస్ చైర్మెన్ గుమ్మకొండ రజనీ విట్టల్ రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ సాగర్ రోడ్డు సమీపంలోని సెంట్రల్ కాలనీలోని నాగార్జున మోడల్ స్కూల్లో బుధవారం మాంటిస్సోరి కాన్వొకేషన్ డే వేడుకల్లో వారు పాల్గొని ప్రసంగించారు. చిన్నారులు ఆకర్షణీయమైన దుస్తులలో ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకు న్నాయని విశాలమైన ఇండోర్, అవుట్ డోర్ ప్లేగ్రౌండ్లతో పాటు స్విమ్మింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేసి చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో గ్రహణశక్తిని పెంపొందించేందుకు ఆడియో విజువల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కార్యాచరణ రూపొంది స్తున్నామని రజినీ విట్టల్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.పద్మావతి, మాంటి స్సోరి ఇన్చార్జి ఉషశ్రీ, ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.