Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గౌలిగూడ ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం చిరాగ్ అలీ లైన్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బం దికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ పరిక రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వి ద్యార్థులు, ప్రజలు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని సూ చించారు. అగ్నిమాపక కేంద్రం ఫోన్ నెంబర్ 101 ఉంచు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ కరపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్కే సునీల్, ఫైర్ మాన్లు ఎస్.సుశీల్‌కుమార్, లీడింగ్ ఫైర్ మాన్ ఎండి షబిర్ఆలీ, ఫైర్ మాన్లు క్రాంతి కుమా ర్, సురేష్, నిరీక్షణ రావు, డ్రైవర్ రహీముద్దీన్, డి.సాగర్ గౌడ్, టి.అనిల్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.