Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో కలుషిత మంచినీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలి పారు. డివిజన్లోని పురుషోత్తమ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న డెబోరా కాలనీవాసుల కలుషిత మంచినీటి సరఫరా సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కలిసి డేబో రా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ కలుషిత మంచి నీటి సరఫరా ఎక్కడి నుంచి ఏర్పడు తుంది ఆన్న దాన్ని పరిశీలించి వెంటనే సమస్యను పునరా వృత్తం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకో వాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. వెంటనే కలుషిత నీటికి బదులుగా మంచి నీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. డివిజన్లో ఎక్కడా కలు షిత నీటి సరఫరా సమస్య ఏర్పడినా, వెంటనే అధి కారులు అప్రమత్తమై సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముత్యాలు, కృష్ణ ప్రసాద్, స్థానికులు జాంగిర్ పాష, మున్నా భారు, అర్షద్ పాష, ఇంతియాజ్, మహిళలు పాల్గొన్నారు.