Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
సరూర్‌నగర్ డివిజన్లో పారిశుధ్యంతో పాటు కాలనీలోని తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. డివిజన్లోని బాపు నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వ ర్యంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం విత్ కాలనీ అసోసియేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొ నగా.. కాలనీలో పలు సమస్యలను ప్రజలు వివరించారు. అనంతరం వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాలనీలో డ్రయినేజీ గుంత లతో పాటు పది రోజులకి ఒకసారి డ్రయినేజీ పొంగి పొర్లడంతో కాలనీ వాసులు బాగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని చోట్ల కొత్త లైన్లు వేయడంతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న లైన్‌ను బాగు చేయాలని, ఇంటర్నల్ రోడ్స్ రిపేర్ చేయాలని కోరారు. అలాగే బస్తీలో త్రీ ఫేస్ కరెంట్‌తో పాటు రోడ్ నెం 2,5లో కరెంట్ పోల్స్ కావాలన్నారు. రోడ్ నెం. 4లో కొత్త సీసీ రోడ్ వేయించాలని విన్నవించారు. చెట్ల కొమ్మలతో కాలనీలో కరెంట్ సమస్యలు వస్తున్నాయని, వాటిని కట్ చేయవల సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోయిని మహేందర్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గ మాజీ యూత్ వింగ్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి, విద్యార్ధి నాయకులు పుట్టం విజరు, నియోజక వర్గ వీసీ సెల్ ప్రధానకార్యదర్శి గౌని శ్రీనివాస్ గౌడ్, కిల్లా మైసమ్మ టెంపుల్ మెంబర్ రాగం సునీల్ యాదవ్, ప్రత్యుష్, గుండె నాగరాజ్, వినరు చారి, సాజిద్, జీహెచ్ఎంసీ అధికారులు పూజ, శివ, సురేష్, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.