Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
నియోజకవర్గంలోని పలు డివిజన్ల్లో నెలకొన్న సమస్య లను పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం డివిజన్లోని భరత్‌నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్‌లో స్థానిక కార్పొరేటర్ మందముల రజితా రెడ్డి, ఉప కమిషనర్ అరుణకుమారితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని కాలనీలో పర్యటించారు. ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రయినేజీ సమస్యలతో పాటు రోడ్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, అన్య వెంకటేష్, నోముల మైసయ్య, పొంగ మహేందర్ రెడ్డి, సల్ల సందీప్ రెడ్డి, మల్లేష్, స్థానిక కాలనీవాసులు, తదితరులు ఉన్నారు.