Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్
నవతెలంగాణ - ఘట్కేసర్
రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతోం దని టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఘట్ కేసర్ మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండలం లోని అంకుశాపూర్, అవుషాపూర్ గ్రామాల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను కలుస్తూ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి కోరల్లో చిక్కు కొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫల మయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనతో ప్రజలు విసుగుచెందారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత, మేడ్చల్ నియోజకవర్గం హాత్ సే హాత్ జోడో యాత్ర ఇన్చార్జి చారుకొండ వెంకటేష్, మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, అధికార ప్రతినిధి కవాడి మాధవరెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తోటకూర అజరు యాదవ్, అవుషాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు మేడబోయిన జంగయ్య ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీ పులకంటి భాస్కర్‌రెడ్డి, ఫట్కేసర్ మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిళ్ల ముత్యాల్దవ్, పన్నాల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.