Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపుర్లో బీఅర్ఎస్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కుత్బుల్లాపూర్ నియోకవర్గ బిఆర్ఎస్ కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య బండల వెంకటేష్, శంభీపుర్ యాదగిరి, తిరుమలేష్, జీ.మల్లేష్, శ్రీశైలం యాదవ్, బిక్షపతి, శ్యామ్రావు, ఆకుల బాబు, క్రిష్ణ, సుంకరి వినోద్, ఆర్కల వెంకటేష్, కిరణ్, బండల మురళి, హరీష్, యూత్ నాయకులు శంభీపుర్ దీపక్, నవీన్, ఆకాష్, రాజేష్, సతీష్, మురళి, వెంకటేష్, ప్రభు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు...
కొలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో స్థానిక నాయకులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ, బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి,అనుబంధ కమిటీల సభ్యులు వెంకటేష్, బట్ట మురళి,గాలి శ్రీనివాస్, చందు,నిరుడు యాదగిరి, లడ్డు, ఇస్మాయిల్, బాలరాజు, సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.