Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో ఇంటింటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయ ప్రదం చేయాలని కోరుతూ బుధవారం జగద్గిరిగుట్ట సీపీఐ కార్యాలయం ప్రాంగణంలో సిపిఐ నాయకులు కరపత్రా లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు మాట్లాడు తూ నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలు లక్ష కరపత్రాలను 40 వేల ఇండ్లకు లక్ష మంది ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు, సహదేవ్ రెడ్డి, వంగాల శ్రీనివాస్, పర్వీనా సుల్తానా, మండల నాయకులు ఇమామ్, సుధాకర్, రాజు, నగేష్ చారి, చాంద్, కీర్తి, ప్రసాద్, నర్సమ్మ పాల్గొన్నారు.