Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ పరిధిలోని 5 యూనిట్ ల ఆధ్వర్యంలో మంగళవారం కాప్రా సర్కిల్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి కాప్రా సర్కిల్ కార్యాలయంలో ర్యాలీని ముగించారు. కాప్రా సర్కిల్ అసిస్టెంట్ ఎండమాలజిస్ట్ రమేష్ మాట్లాడుతూ వారంలో ఒకరోజు ప్రై డే-డ్రై డే, నిర్వహిస్తూ దోమలు వద్ధి చెందకుండా చేద్దాం, దోమకాటు-ఆరోగ్యానికి చేటు, మంచినీటి పాత్రల పై మూతలు పాడుదాం- దోమలు ఆవాసాలుగా మారకుండా చేద్దాం,పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొందాం-ప్రజా ఆరోగ్యాన్ని కాపాడదాం వంటి పలు నినాదాలు చేశారు. లార్వా ఉన్న తోట్టెలు,డ్రమ్ములు,పూల కుండీలు నుండి నీటిలో పెరిగే ఏడీస్ దోమ వలన డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని సూచిస్తూ మంచినీటి పాత్రల పై మూతలు తప్పకుండా పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మలేరియా సిబ్బంది మాట్లాడుతూ మలేరియా రహిత సమాజంప్రజభాగస్వామ్యంతోనే సాధ్యమని,ప్రజలందురూ చోరవతోదోమలు వద్ధి చెందకుండా చేయడం-లార్వా నిర్మూలనకు క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నివారణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తత సేవలు అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు, నరేందర్ రెడ్డి,కనకరాజు, నరసింహ గౌడ్,పరమేష్ , తదితరులతోపాటు 5 యూనిట్ లు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.