Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్/సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ కొచింగ్ క్యాంపును స్పోర్ట్స్ కమిషనర్ విజయలక్ష్మి, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్‌తో కలిసి ప్రారం భించారు. మంగళవారం ఖైరతాబాద్ జోన్ చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్‌లు 37 రోజులపాటు కొనసాగనున్నా యని చెప్పా రు. ఈ సందర్భంగా క్రీడాకారులు చేసిన విన్యాసాలు ఆక ట్టుకున్నాయి. ఈ సమ్మర్ క్యాంపులలో 44 రకాల క్రీడలలో శిక్షణను ఇవ్వనున్నట్టు తెలిపారు. కోచ్‌లకు క్రీడా సామాగ్రి ని అందించారు. ఈ శిక్షణ ఆరేండ్ల నుంచి 16 ఏండ్లలోపు పిల్లలు వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ కమిషన్ డిడి నాయక్, ఖైరతాబాద్ జోన్ గేమ్స్ ఇన్స్పెక్టర్ టి.మాధవి, క్రీడాకారు లు, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.