Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం సహా 12 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొపెసర్స్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓయూ పరిపాల భవనం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఓయూ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ అధ్యక్షుడు పరశురాం, వర్కింగ్ ప్రసిడెంట్ డా.ధర్మతేజ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యపకులను జీవో 16 ప్రకారం రెగ్యులర్ చేస్తామని 2016లో హామీనిచ్చారనీ, ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ సర్వీస్లను క్రమబద్దీకరించిందని తెలిపారు. డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు యూజీసీ, ఏఐసీటిఈఏ నిబంధనల ప్రకారం ఏ అర్హతలు కలిగి ఉన్నారో తాము కూడా అవే అర్హతలు కలిగి ఉన్నామన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని పక్షంలో అన్ని యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్లను కలుపుకుని దశల వారీగా మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో డా.నిరాజరావు, డా.వినిత పాండే, డా.ఉపేందర్, డా.బాలకోఠిÄ, డా.ఆనంద్, డా.కవిత, డా.భాస్కర్, డా.ప్రేమయ్య, డా.రామకృష్ణ, డా.శంషాద్దీన్ డా.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.