Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రముఖ మార్క్సిస్టు మేధావి, తత్వవేత్త సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ నేటికీ భవిష్యత్ తరాలకు మార్గదర్శి అవుతుందని ఏఐటీయూసీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్ రాజ్ గుర్తు చేశారు. కారల్ మార్క్స్ 205వ జయంతి సందర్భంగా శుక్రవారం హిమా యత్నగర్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో కారల్ మార్క్స్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారల్ మార్చ్ 1813లో జన్మించి 1883లో చనిపోయిన నాటికి రాత్రి, పగలు తేడా లేకుండా ప్రపంచంలో పెట్టుబడిదారి విధానం అంతం చేసి కార్మిక వర్గం న్యాయకత్వంలో సోషలిజం స్థాపనకు ఆయన రాసిన దాస్ క్యాపిటల్ నేటికి భవిష్యత్తు తరాలకు మార్గదర్శి అవుతుందని గుర్తు చేశారు. కారల్ మార్క్స్ జీవితాంతం కడు దరిద్య్రాన్ని, ఆకలిని అనుభవిస్తూనే భవిష్యత్తులో ఆకలి, దరిద్రం, పేదరికం లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు అహార్నిషలు కృషి చేస్తున్న సందర్భంలో తన ముగ్గురు పిల్లలకు కనీస వైద్యం అందించలేకపోవటంతో చనిపోయినా కారల్ మార్క్స్ కుంగిపోలేదని ఆయన తెలిపారు. తాను ఉంటున్న అద్దె ఇంటికి అద్దెను చెల్లించలేక తరుచుగా ఇండ్లను మారుస్తూ అనేక అవస్థలకు గురైన ఆయన ఆశయం, ఉద్దేశం కొనసాగించేందుకు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మా, కార్యదర్శి బి.వెంకటేశం, సీపీఐ నగర కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, నాయకులు బొడ్డుపల్లి కిషన్, నెర్లకంటి శ్రీకాంత్, కృష్ణ పాల్గొన్నారు.