Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నరసింహ
నవతెలంగాణ-అంబర్‌పేట
తమ స్వార్థ మతతత్వ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ బీజేపీ ఎంఐఎంతో కొనసాగిస్తున్న అనుబంధం దేశానికి ప్రమాదకరం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర ఓట్లు విభజించడం ద్వారా బీజేపీని గెలిపించాలనే కచ్చితమైన లక్ష్యంతో ఎంఐ ఎం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయాల్లోకి అడుగు పెట్టిందనీ, ఇది వాస్తవమనీ, బీజేపీ ఎంఐఎం మధ్య కచ్చిత మైన చీకటి ఒప్పందం ఉందన్నారు. ప్రజా వ్యతరేక ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరుతూ ''బీజేపీ హటావ్-దేశ్ బచావ్'' నినాదంతో తిలక్‌నగర్, నల్లకుంట, విద్యానగర్, శివమ్ రోడ్ ప్రాంతాల్లో శనివారం సీపీఐ పాదయాత్ర నిర్వహించి ంది. ఈ సందర్భంగా ఈ.టి. నరసింహ, సీపీఐ హైదరాబా ద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం ఇంటింటికీ, వ్యాపార సముదాయాలు తిరిగి కరపత్రాలను పంచుతూ బీజేపీ ప్రజా వ్యతరేక విధానా లను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఈ.టి. నరసింహ మాట్లాడుతూ బీజేపీ ఫాసిస్టు భావజాలం దేశ శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగిస్తుందన్నారు. రోజురోజుకూ పెరు గుతున్న సామాజిక అశాంతితో లక్షలాది మంది ప్రజలు జీవన వ్యయ సంక్షోభంతో పేదరికంలోకి నెట్టవేయబడుతు న్నారనీ, ఇవేవి పట్టించుకోకుండా ప్రధాని మోడీ మాత్రం మౌన దీక్షలో ఉంటాడన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయ డం, హక్కులను కాలరాయడం, చట్టాలను దుర్వినియోగం చేయడం వంటి క్రూరమైన విధానాలను అవలంబిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలను కోరా రు. ఛాయాదేవి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వల్ల అదా నీ, అంబానీ లాంటి కార్పొరేట్లు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ లబ్ది పొందలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వానికి మతతత్వ రాజకీయాలు చేయడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ప్రజా సంక్షేమానికి ఎప్పుడు పాటుప డలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిరంకుశ పాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు 2024 ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యం నిర్ణయాత్మక విజయానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. బి.వెంకటేశం మాట్లా డుతూ నిరుద్యోగం, ధరల పెరుగుదలను ఎదుర్కోవడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమై తన అసమ ర్థతను నిరూపించుకుందన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. మోసపూరిత మోడీ ప్రభు త్వాన్ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో సీపీఐ హైద రాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్, నగర నేతలు నిర్లేకంటి శ్రీకాంత్, బైరగోని రాజు గౌడ్, వెంకట్ స్వామి గౌడ్, సీహెచ్. శ్రీనివాస్, ఎండి. ఒమర్ ఖాన్, భూపాల్, లతీఫ్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.