Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జలకాంతం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా 125 అడుగులు బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్ట డాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన సీఎం కరేసీఆర్కు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో ధన్యవాద సభ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. శనివారం గన్ పార్క్ వద్ద తెలంగాణ ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోనూ ధన్యవాద సభలు జరుపుతామని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమన్నారు. దీన్ని ఓర్వలేని వారు కొంత మంది ఉన్నారనీ, అందులో ఒక్కటి బీజేపీ నాయ కుల తట్టుకోలేక పోతున్నరని చెప్పారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభు త్వ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తారని భయం బీజేపీ నాయకుల్లో మొదలైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు తెరిస్తే అబద్దాలడుతున్నారన్నారు. హిందువు లు అని చెప్పుకుంటారే తప్పా వారికి ఇచ్చిన వాగ్దానాలను ఎరవేర్చడం లేదన్నారు. యువతకు 2కోట్ల ఉద్యోగాలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. అధికారంలో వచ్చేముందు అవినీతిమయ దేశానికి తాము దీక్షులం అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు నల్లధనం తీసుకొస్తామని చెప్పి ఏండ్లు గడిచినా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ వేదిస్తున్నారనీ, మహిళా క్రీడాకారిణులు ధర్నా చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయివేటు ఉదోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు గంధం రాములు, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కోల రాములు, బీజే సంఘాల జేఏసీ చైర్మెన్ ఓరుగంటి వెంకటేష్‌గౌడ్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, గిరిజన రాష్ట్ర నాయకులు డాక్టర్ బానోత్ సంజీవ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.