Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్య మంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాక డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందు తూ అయిన ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆరు మంది లబ్ధిదారులకు రూ.2 లక్షలా 46వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగ కరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందు నిలబడి అండ గా ఉంటారనీ, అందులో భాగంగానే వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న పేద ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటుమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.