Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివృద్ధి పనులను ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ బి.పద్మా వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని గజానంద్ గడ్డ నుండి పాముల బస్తికి వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు పనులను కార్పొరేటర్ జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజానంద్ గడ్డ నుండి పాముల బస్తీకి వెళ్లే సిమెంటు రోడ్డును తవ్వి అలాగే వదిలేయడంతో స్థానిక ప్రజలు, వచ్చిపోయే వారికి, అనేకమందికి ఇబ్బందులు కలుగుతుందనీ, ఇప్పటికైనా పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత నీటితో సరైన క్యూరింగ్ జరిగే విధంగా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధి అజరు కుమార్, నాయకులు మిరియాల శ్రీనివాస్, విజరు కుమార్, బాలకృష్ణ, గుగ్గిళ్ళ శ్రీనివాస్, రవీందర్ వంజరి, అనిల్ రామ్, నర్సింగ్‌రావు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, యాదగిరి, స్వామి, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.