Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తాన్ని చెమటగా మార్చి ప్రజలకు ప్రభుత్వాలకు సేవలు
- ప్రభుత్వానికి హమాలీ శ్రమనుండి కోట్ల ఆదాయం
- సంక్షేమం కోసం నయాపైసా కేటాయించని ప్రభుత్వాలు
- ఆందోళనకు సిద్దమవుతున్న హమాలీలు
- సీఐటీయూ ఆధ్వర్యంలో రేపే కలెక్టరేట్ ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి ప్రజలకు, ప్రభుత్వాలకు అనేక సేవలు అందిస్తున్నా పాలకులు మాత్రం వీరిని గాలికి వదిలేసారు. కనీస వేతనాలు లేక కుటుంబాలను గడపలేక అష్టకష్టాలు పడుతున్నారు. కండలను పిండిచేస్తూ అనారోగ్యాల పాలవుతూ, కుటుంబ పోషణ భారం అవుతుంది. అనేకసార్లు సమస్యలపై ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. దీంతో ఓపిక నశించిన హమాలీలు తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హమాలీలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు సివిల్ సప్లరు ఎఫ్‌సిఐ, జీసీసీ మార్కెట్ యార్డ్ కోల్డ్ స్టోరేజ్, సిమెంట్ గోదాంలు కూరగాయాలు పండ్లు మార్కెట్ రైస్ ఆయిల్ దాల్ మిల్స్, ఇసుక కంకర క్వారీలు రైల్వే ఆర్టీసి గ్రామీణి బజార్ హమాలీలు ఐకేపి హమాలీలు స్టోర్ వర్కర్స్ ప్రజా పంపీణీ వ్యవస్థలో అనేకరకాల పనులు చేస్తూ రోజుకు 10 నుండి 12 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి అనేక రకాల సేవలు చేస్తున్నారు. హమాలీలు నిత్యం బరువులు మోయడం వల్ల శరీరం బండబారిపోతుంది. నడుములు వంగిపోయి నరాలు చచ్చుబడిపోతున్నాయి. దుమ్ముదూలి గాలి వెలుతురు లేక గోదాంలలో పనిచేయడం వల్ల ఊపిరితిత్తులు జబ్బుల బారిన పడుతున్నారు. పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాయాలపాలై కాల్లు చేతులు విరిగి మంచాలకు పరిమితమై జీవశ్చవంలా మారి హమాలీల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 50 కిలోలకు మించి హమాలీలతో బరువులు మోయించవద్దని ఐఎల్ఓ తీర్మాణం ఉన్నప్పటికి అధిక బరువులు మోయడం వలన 30 నుండి 40 సంవత్సరాల వరకే ముసలివారవుతున్నారు. ప్రభుత్వానికి హమాలీల శ్రమ నుండి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా హమాలీల సంక్షేమం కోసం నయాపైసా బడ్జెట్ కేటాయింంచకపోవడం తీవ్ర అన్యాయం.
కార్మికచట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ కార్మిక వర్గం స్వాతంత్య్రానికి ముందే సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి. 29 కార్మిక చట్టాలను మార్చి 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోట్స్‌ను తెచ్చింది. ఇవి అమలు అయితే కార్మిక హక్కులన్ని హరించుకుపోతాయి. సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కు యజమానులతో బేరసారాలు ఆడే హక్కు 8 గంటల పని విధానం కనీస వేతనాలు ఈపిఎఫ్ ఈఎస్ఐ వంటి చట్టబద్ద హక్కులు ఎలాంటి సౌకర్యాలు లేకుండా యజమానులకు కట్టుబానిసలుగా మార్చే చర్యలకు మోడి ఫ్రభుత్వం పూనుకుంది. అసంఘటిత రంగ కార్మికులకు 2008లో తీసకువచ్చిన సామాజిక భద్రత చట్టాన్ని కూడా ఫ్రశ్నార్ధకంగా మార్చారు. ప్రభుత్వరంగ సంస్ధలకు కారుచౌకగా బడాబాబులకు కట్టబెడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై బారాలు మోపుతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో తెలంగాణా ఏర్పాటులో అసంఘటిక కార్మికుల శమ కష్టం ఉంది. వారి సమస్యలు పరిష్కరి స్తామని చెప్పి 9 సంవత్స రాలు కావస్తున్నా పట్టించు కోకపోవడం దారుణ మన్నారు.
ఆందోళనకు సిద్ధమయిన హమాలీలు
హమాలీల గోడును అనేకసార్లు సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకు పోయినా పట్టించు కోకపోడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. హమా లీలు అందరికి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని 50 కేజీలకు మించిన బరువులు నిశేదించారని పనిగంటలకు పనిభద్రత గుర్తింపుకార్డులు కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి చట్టబద్ద హక్కులు కల్పించాలని, ఫ్రభుత్వ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని హమాలీలు అందరికి ఇండ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూం ఇచ్చి తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న కలెక్టరేట్ వద్ద ధర్నాలు, ఏప్రిల్ 27న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా తెలంగాణ ఆల్ హమాలీ వర్కింగ్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్యాక్రమాలు చేయనున్నారు.
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి
ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో హమాలీ కార్మికులు శ్రమ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి జిసిసి సివిల్ సప్లై, బేవరేజ్ ఎఫ్‌సిఐ వ్యవసాయ మార్కెట్ తదితర సంస్థలతోపాటు ప్రైవేటు విభాగాలు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది హమాలీ కార్మికులు శ్రమ చేస్తున్నారు. వీరి శ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్తుంది. హమాలీ కార్మికులకు ఎటువంటి భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల వలె హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి హమాలీ కార్మికుడికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్‌ని, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్స్ సౌకర్యాలను కల్పించాలి. హమాలి కార్మికులకు భద్రత కల్పించడం ప్రభుత్వాలు తమ బాధ్యతగా గుర్తించాలి. హమాలీ కార్మికులకు ప్రభుత్వం అమలు జరిపే అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.