Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు చెంచాల పాలకు చెంచా గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి రాత్రంతా వదిలేయాలి. ఉదయం చల్లని నీటితో కడిగితే ముఖ చర్మ రంధ్రాల్లో మురికి దూరమవుతుంది. బయటికెళ్లొచ్చిన తర్వాత ముఖంపై పేరుకొన్న దుమ్ము, ధూళిని దూరం చేయడానికి, అలాగే మేకప్‌ను శుభ్రపరచడానికీ ఇది ఉపయోగపడుతుంది. అరకప్పు నీటిలో చెంచాన్నర గ్లిజరిన్, మూడు చెంచాల మొక్కజొన్న పిండి కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి. ఈ పేస్టును ముఖానికి రాసి తడీపొడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ముఖచర్మంపై మురికి పోయి అద్దంలా మెరుస్తుంది.