Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ రాములు అన్నారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది.ఆ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ పండుగ వేళ పేదలకు రేషన్ బియ్యాన్ని తగ్గించడం దుర్మార్గపు చర్యగా భావించారు. కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం బొంకుతో ఇప్పటివరకు బియ్యం పంపిణీ చేయకపోవడం.విడ్డూరం అన్నారు.తక్షణమే .12 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల కుర్మయ్య ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోలే జగన,్ కడియాల మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, రాములు ,సహాయ కార్యదర్శిలు భగవంతు, పాండు,.సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.