Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- అమరచింత
కులం వద్దు.. మతం వద్దు.. ఐక్యత కోసమే క్రీడలు నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ, డీివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరి ంచుకొని అమరచింత మండల కేంద్రంలో శనివారం జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కే రాఘవ, డీివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు చందు జండాను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా కులం వద్దు.. మతం వద్దు.. ఐక్యత కోసమే క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆనవా యితీగా ఏటా సంక్రాంతి పండుగను పురస్క రించుకొని ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. ముఖ్య అతిథులుగా సీపీిఎం జిల్లా కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపీి, సీపీఎం మండల నాయకులు బీ వెంకటేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్యన్ రమేష్, హాజరై వీజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారన్నారు. క్రీడలకు నిధులు కేటాయించడం లేదని, క్రీడలు, క్రీడాకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడితే క్రీడల్లో క్రీడాకారులు అగ్ర గ్రామీగా నిలుస్తారని అన్నారు. చిన్న చిన్న దేశాలలో క్రీడా రంగానికి అధిక శాతం బడ్జెట్లో కేటాయించడం జరుగుతుందన్నారు. భారతదేశం క్రీడల్లో అగ్ర గ్రామిగా నిలవాలంటే నిధులు అధిక మొత్తంలో కేటాయించాలని వారు అన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరి ంచుకొని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువకులు ముందు కొచ్చి కులమతాలకు అతీతంగా క్రీడల్లో పాల్గొని క్రీడల్లో విజయం సాధించేందుకు పది సంవత్సరాలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు ప్రతిష్ ,చంటి, ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్, వినరు రమేష్ పాల్గొన్నారు.
వీపనగండ్ల : మండలకేంద్రంతో పాటు గో వర్ధనగిరి, సంగి నేనిపల్లి, బొల్లారం తదితర గ్రా మాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో ,రన్నింగ్,ముగ్గులు, పాటలు పోటీలను నిర్వహి ంచారు. విజేతలకుఆయాగ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు బహుమతులను ప్రదానం చేశారు.
పానగల్ : డీివైఎఫ్ఐ, ఐద్వా మహిళా సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పానగల్ మండలంలో రేమద్దుల, తెల్ల రాళ్లపల్లి, తెల్ల రాళ్లపల్లితండా.గ్రామాల్లో సంక్రాంతి కీడు ఉత్సవాలు నిర్వహించారు మూడురోజులు పాటు వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్. ఎద్దుల బండ్లు సంస్కృతి కార్యక్రమాలు పాటలు, ఆటలు క్రీడాఉత్సవాలను నిర్వహించారు. నిర్వహించిన ఆటలు పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సంబంధింత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు బహుమతులను ప్రదానం చేశారు. తెల్లరాళ్లపల్లి తండాలో గిరిజన ఆధ్వర్యంలో జరిగిన క్రీడా ఉత్సవాల్లో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఏం బాల్య నాయక్ ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు గ్రామీణ ప్రాంతంలో కనుమరు గవుతున్న క్రీడా రంగాన్ని బయటికి తీసుకు రావా లని ఉద్దేశంతో ఆటలు నిర్వహించను న్నామ న్నారు. యువతీ, యువకులు చెడు మార్గం పోకుండా సమా జ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతమ్మ , వృత్తిదారుల నాయకులు జీ. దేవేందర్ ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు చిట్టెమ్మ, డీవైఎఫ్ఐ నాయకులు కురుమయ్య, రైతు సంఘం నాయకులు జములయ్య , సాయిలు, భీముడు , శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.