Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్వాడ : మండల కేంద్రంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్ నందలాల్ పవర్ ఆకస్మితంగా పరిశీలన చేశారు క్లాస్ రూమ్ లో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించారు తరగతి గదిలో విద్యార్థుల యొక్క సామర్ధ్యాన్ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి బహుమతులను అందజేశారు. ఇదేవిధంగా కొనసాగించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని హెచ్ఎం లక్ష్మణ్ నాయకు ను కోరారు అనంతరం మండల పరిధిలోని దొర్రి ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మల్లేష్ పుల్లయ్య టీచర్లను అదనపు కలెక్టర్ అభినందించారు. అదే పాఠశాల నుండి నాలుగు సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలకు 60 మందిని ఎంపిక చేశామని కలెక్టర్కు తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజ్, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, సర్పంచ్ రేవతి సత్యం, డిఆర్డిఎ పీడీ యాదయ్య, తహసీిల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రాజు నాయక్, ఉపసర్పంచ్ గంగాపురి కో ఆప్షన్ నెంబర్ మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.