Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపాదనలో సగం ఖర్చు చేసి పేదలను ఆదుకుంటున్న ట్రస్టు
- ఉప్పల చారీటబుల్ ట్రస్టు చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసి ఉప్పల వెంకటేష్
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఇళ్లు లేదు సొంత ఇంటికోసం ఆర్థిక సహాయం చేయాలని కొందరు... మాపిల్లాడి పై చదువులకు డబ్బులు లేవంటూ.... మరికొందరు ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రి ఖర్చులకు సహాయం చేయాలని ఇంకొందరు మా బడిలో తాగునీరు, బెంచీలు, మౌలిక వసతులను కల్పించాలని ఉపాధ్యాయులు ఇలా అనేక మంది ఉప్పల వెంకటేష్‌ను ఆర్థిక సహాయం అడుగుతారు. తను సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడుతూ... తన ఔదా ర్యాన్ని చాటుతున్నారు.ఉప్పల.వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏదైనా సరే... చివరికి సింహం పై స్వారీ చేసైనా గెలిచి తీరుతానని ఉప్పల చారీటబుల్ ట్రస్టు చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసి ఉప్పల వెంకటేష్ అన్నారు. నవతెలంగాణతో మాట్లా ్ల్లడారు. నాకు డబ్బుల మీద ప్రేమ లేదు. ప్రజలు క్షేమంగా ఉండటమే నా లక్ష్యమని తెలిపారు. వారు పడుతున్న కష్టాలు చూసి చలించి నా సంపాదనలో కొంత ఖర్చు పెట్టి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లికి మించిన దైవం లేదు. నేను ఈ ప్రాంతంలో 1100ల మందికి సొంత ఇంటి నిర్మాణం చేశానని తెలిపారు. తలకొండపల్లి మండలం చెన్నంపల్లి, వెంకటా పూర్ గ్రామాల పరిధిలో వారం రోజుల క్రితం 21 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశానని గుర్తుచేశారు. 15 ఏళ్ల కావస్తున్నా...ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదు. దీంతో నాణ్యమైన విద్య అందిచండం కోసం, పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేశారు. తాగునీరు, బెంచీలు, ప్రహరీగోడలు, పుస్తకాల వంటివి లేవు. అందుకే నా సొంత నిధులతో చారిటబుల్ ట్రస్టు ద్వారా డబ్బులు నిధులు ఖర్చు చేస్తున్నారు.పేదలకు వైద్యం అందక వేలాది మంది చని పోతున్నారు. అందుకే ప్రభుత్వ వైద్య శాలలు బలోపేతం కావాలి. నావంతుగా ప్రభత్వు పాఠశాలల్లో మౌళిక వసుతుల ఏర్పాటు చేస్తున్నాను. ఈ మద్య కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎటువంటి పస లేదు. ముఖ్యంగా పేదలకు బరోసా ఇచ్చేందుకు ఏమాత్రం ఉపయోగ పడదు. అందుకే పేదలకు ఉపాది, ఉద్యోగ, వేతనాలతో పాటు విద్య, వైద్యం , సాగు తధితర ముఖ్య అంశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు.వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటున్న నాకు రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్న నాకు ప్రజలు అదేవిధంగా నన్ను ఆశీర్వదించాలని కోరారు.