Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా శాఖ జిల్లా అధికారి అశోక్
నవతెలంగాణ-సూర్యాపేట
పర్యావరణ పరిరక్షణ కోసం గుడ్డ సంచులు అందివ్వడం ఆలోచన బావుందని,ఎందరికో రోల్ మోడల్‌గా బాల్ భవన్ సర్వీస్ నిలుస్తుందని జిల్లా విద్యా శాఖ అధికారి కె.అశోక్ అన్నారు.శనివారం స్థానిక జిల్లా బాలభవన్‌ను ఆయన విజిట్ చేసిన అనంతరం మాట్లాడారు.చదువుతో పాటు లలితకళలు,క్రీడలు, శిక్షణలు విద్యాశాఖ ద్వారా అందుబాటులో ఉన్నా యన్నారు.మరెక్కడా లేని విధంగా సామగ్రి అందుబాటులో ఉందన్నారు. బాల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలు బావున్నాయని కొనియాడారు. ఈసారి ప్రత్యే కంగా కలెక్టర్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని,కాబట్టి బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా క్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ పేపర్‌తో చేసిన క్రాఫ్ట్ బొకేను ఆయనకు అందించి స్వాగతం పలికారు..ప్రతి విభాగంలో శిక్షణ పొందుతున్న చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం చిన్నారుల నత్య ప్రదర్శన తిలకించారు.ఆగస్త్య ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగాలు లెక్కల మెళకువలు శిక్షణను, సంచార ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించి సిబ్బంది వీరేశం, విద్యాసాగర్‌లను అభినందించారు.ఈ కార్యక్రమంలో బాల్భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, సిబ్బంది దాసరిఎల్లయ్య, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరునాయుడు, పద్మ, సునీత, స్టూడెంట్స్ పేరెంట్స్ పాల్గొన్నారు.