Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంక్ వద్ద వినియోగదారుల ఆందోళన
- సివిల్సప్లై అధికారులకు ఫిర్యాదు
- తాత్కాలికంగా బంక్ సీజ్ చేసిన అధికారులు
నవతెలంగాణ-చివ్వెంల
ఇక్కడ బంక్‌లో పెట్రోల్, డీజిల్‌తో పాటు నీళ్లు కూడా పోస్తారు..కాకపోతే నీళ్లకు కూడా పెట్రోల్,డీజిల్ రేటు చెల్లించాల్సిందే. బైక్‌లో పెట్రోల్ పోయించుకునే వారికి, కారు, ట్రాక్టర్లలో డీిజిల్ పోయించుకునే వారికి వాటితో పాటు అదే రేటుకు నీళ్లు కూడా పోస్తారు.కాకపోతే నీళ్లకు బిల్లు ఉండదు.ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామంలో ఉన్న శ్రీ పరమేశ్వరి పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్, డిజిల్ పోయించుకునే వాహనదారులకు వారికి తెలియకుండానే నీళ్లు వస్తున్నాయి.శనివారం బొప్పారంకు చెందిన జుజ్జురు వేణు, ఏపూర్ గ్రామానికి చెందిన రాజు వాహనదారులు తమ బైక్‌లలో పెట్రోల్ పోయించుకోగా ఎంతకు బైక్స్టాట్ కాకపోవడంతో బైక్‌లో పెట్రోల్ వాటర్బాటిల్లో తీసి చూస్తే సగానికి పైగా పెట్రోల్‌లో నీళ్లు ఉన్నాయి.మళ్ళీ బంక్ వద్ద కెళ్ళి ఖాళీవాటర్బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా అందులో కూడా సగం వరకు నీళ్లు రావడంతో బాధితులు బంక్ వారిని నిలదీశారు.ఈ లోగా బంక్ సూపర్వైజర్ వచ్చి ఏదో కోడ్ మార్చి పంపును సెట్ చేయడంతో పెట్రోల్, డీజిల్ వచ్చాయి.అక్కడే ఉండి అంతా గమనిస్తున్న వాహనదారులు బంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా సివిల్అధికారులకు ఫోన్ చేశారు.ఆర్ఐ నాగలక్ష్మి వెంటనే ఏపూర్ బంక్ వద్ద కు చేరుకొని పరిస్థితి పరిశీలించారు.బాధిత వాహనదారులు పోగుల శ్రీమన్నారాయణ,రంపంగు రాజులు బంక్‌లో జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు.పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు గాను బంక్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు.బంక్ లో కనీససౌకర్యాలు కూడా లేవని కల్తీ పెట్రోల్, డీజిల్ కారణంగా ఈ ప్రాంతంలో వాహనాలు తరచూ రిపేర్లు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.