Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఉద్ఘాటించారు.శనివారం చందంపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు రూ.28.96 లక్షలతో,చందంపేట మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు రూ.23 లక్షలతో,పొల్యనాయక్తండాలో రూ.12.54లక్షలతో,గుంటిపల్లి గ్రామంలో రూ.11.85 లక్షలతో,గన్నేర్లపల్లిలో రూ.18.44 లక్షలతో,మానవత్ తండాలో రూ.11.18లక్షలతో 'మన ఊరు-మన బడి' పథకంలో పాఠశాలలఅభివద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ.కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, ఎంపీపీ నున్సవత్ పార్వతిచందు,జడ్పీటీసీ రమావత్ పవిత్ర, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు దొందేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య,మండల ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్‌రెడ్డి, రైతు బంధు మండలఅధ్యక్షులు సిరందాసు కష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, సర్పంచులు గోసుల కవిత అనంతగిరి,మాధవరం శంకర్రావు,కొండ్రపల్లి నాగార్జున్, ఆవునూరి యాదగిరిరావు,వెంకటయ్య, లక్ష్మీగోవింద్యాదవ్, రమావత్ మోహన్‌కష్ణ,గోసుల అనంతగిరి,జక్కుల మున్నయ్య, గంగిడి కొండల్‌రెడ్డి, బొడ్డుపల్లి కష్ణ,మహాలక్ష్మయ్య,శ్రీశైలంయాదవ్,ఎంపీడీఓ రాములునాయక్,గోసుల శివ, సురేష్, బలవద్దిరాజ్ పాల్గొన్నారు.