Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కనీసవేతనాలను సవరించి విడుదల చేయకుండా 2014 నుండి తాత్సారం చేయడం అన్యాయమని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్ విమర్శించారు.శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన సీఐటీయూ జిల్లాకార్యకర్తల వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటానని 2022 మార్చి 15న అసెంబ్లీలో ప్రకటించి నేటికీ అమలు చేయలేదని, ఇప్పటికైనా వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లయిమ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు.ప్రభుత్వ ,కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో 60 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.జూన్ చివరి వరకు సీఐటీయూ సంస్థాగత సన్నాహాలు పూర్తిచేసుకుని ఉద్యమాల్లో కార్మికులను నడిపించడానికి తగిన ప్రయత్నాలు కొనసాగిస్తూ ప్రభుత్వం యొక్క స్పందన బట్టి ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, ఎం.రాంబాబు,చెరుకు యాకలక్ష్మి, కె.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.