Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్:ఆర్యవైశ్య ఆఫీసర్స్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్యసంఘం భవనంలో జరుగుతున్న అంతర్ జిల్లా చెస్ పోటీలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.చెస్ ఆట అత్యంతపురాతనమైన క్రీడ అన్నారు.8వ శతాబ్దంలో మనదేశంలోనే ఈ క్రీడ పుట్టిందన్నారు.ఆ తదుపరి అరబ్బులు,పరిషయన్లు, యూరోపియన్లు నేర్చుకుని ఆటలో కొద్దిమార్పులు చేశారన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఈ ఆట నేర్చుకొని ఆస్వాదిస్తున్నారన్నారు.చెస్ ఆట ఆడటం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందన్నారు.అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రవి, కౌన్సిలర్ దొంగరి మంగమ్మ,ఓరుగంటి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.