Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యతగా తీసుకొని, ప్రతిఒక్కరు వాతావరణ కాలుష్య నివారణను ప్రత్యేక కషి చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఆయన మాట్లాడారు.జిల్లా ప్రజలు, అధికారులు, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత వస్తువులు వాడుతూ ,మొక్కలు ఎక్కువగా నాటాలన్నారు. మొక్కలు నాటితే ప్రాణ వాయువుతో పాటు వర్షం పడి పంటలు పండడంతో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి బతుకుతుందన్నారు. పట్టణంలో ప్రముఖవీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినందుకు జిల్లా కాలుష్య మండలి వారిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సబీనాభేగం, సిబ్బంది అనంతుల వీరస్వామి, సువెన్కంపెనీ ఉద్యోగులు బూర రాములు, కష్ణారావు, పీజే రాయుడు, ఎం.వెంకటరమణ, పీ.వెంకటరమణ, సుధాకర్,సురేష్, సైదులు,సుధాకర్ పీవీపీ సిబ్బంది,రావ్స్ కెమికల్ సిబ్బంది, బాల కేంద్రం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.