Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
గ్రామాభివద్ధిలో దాతలు పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.ఆదివారం మండలపరిధిలోని కూచిపూడిలో టీఆర్ఎస్ నాయకులు, ఆర్ఎంపీ కాసాని వెంకటేశ్వర్లు తన తల్లిదండ్రులు నాగయ్య భారతమ్మల జ్ఞాపకార్థం రూ.3లక్షలతో చేపట్టనున్న ఈద్గాపనులను ప్రారంభించి మాట్లాడారు.దాతలు తమకున్న దానిలో ఎంతోకొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగిం చాలన్నారు.ముస్లిముల ప్రార్థన మందిరం కోసం ఈద్గాను నిర్మించేందుకు ముందుకు వచ్చిన వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారి, శేషు, శెట్టి విజయభాస్కర్, శెట్టి నాంచారయ్య, మిర్యాలరామారావు, శెట్టి పూర్ణచందర్రావు, చేతుల రామకష్ణ,సైదా, అబ్దుల్నబీ, వెంకటనారాయణ, పసుపులేటి పుల్లయ్య, పెంటు పాల్గొన్నారు.