Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50వేల ఓట్లతో గెలుస్తాం
- రానున్నది కాంగ్రెస్సే
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-గరిడేపల్లి
2018 ఎలక్షన్ మానిఫెస్టోలో లక్షలోపు రుణ మాఫీ చేస్తాం అని ప్రజలను మోసం చేసిన ఈ మోసకారి పార్టీ ని బొంద పెట్టాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.హుజూర్నగర్ నియోజక వర్గంలోని గరిడేపల్లి మండలంలో రైతు భరోసా, రచ్చబండ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.తాను ఓట్ల కోసం మీ దగ్గరకు రాలేదని, మీ సాధక బాధకాలు తెలుసుకొని మీకు అండగా ఉండటానికి వచ్చానన్నారు. రాబోయే ఎన్నికల్లో 50వేల మెజారిటీతో హుజూర్నగర్ నియోజకర్గంలో గెలవబోతున్నామన్నారు పేదలకు ఇండ్లు కట్టించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హయాంలో ఇండ్ల పట్టాలు ఇస్తే వాటిని పేదల దగ్గర నుంచి లాక్కొని ఆయా భూమిలో మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని, ఇది తుగ్లక్ ప్రభుత్వం అని విమర్శించారు. ప్రతి ఇంటికి త్రాగు నీరు అందిస్తేనే ఓట్లు అడుగుతాం అని చెప్పిన కెసిఆర్ నుంచి సైది రెడ్డి వరకు ఏ మొహాలు పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఇండ్లు కట్టిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు త్రిపుర అంజన్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు బచ్చలకూరి కష్ణప్రసాద్, రాయినిగూడెం గ్రామ అధ్యక్షులు గుండు రామాంజిగౌడ్, మాజీ ఎంపీపీ పయిడిమర్రి రంగనాథ్, కల్మల్చేర్వు సర్పంచ్ సీతారామ్ రెడ్డి, గానుగుబండ ఎంపిటిసి పరమేష్, ఎంపీటీసీ బల్డురి సందీప్ తదితరులు పాల్గొన్నారు.