Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారిణి
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని ఖాశీంపేట బేతెస్థ ప్రార్ధన మందిరంలో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా.దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో బొల్లెద్దు హారికకు బేతెస్థ సంఘం తరుపున చిన్న ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ నాయకన్‌గూడెం గ్రామం వాస్తవ్యులు బొల్లెద్దు వెంకటేశ్వర్లు పూలమ్మ కుమార్తె హారిక బాలికల గురుకుల పాఠశాల కూసుమంచిలో 8వ తరగతి చదువుతూ కరాటేలో ఆసక్తి కనబరిచిందన్నారు.దీంతో ప్రిన్సిపాల్ పద్మావతి, మాస్టర్ మనిషే హారిక నైపుణ్యతను గుర్తించి శిక్షణ అందించారన్నారు.వారి నమ్మకాన్ని నిలబెట్టి ఇప్పటికే గోవా రాష్ట్రంలో, హరియాణా పలు రాష్ట్రాలలో గోల్డ్ మెడల్ సాధించింది.అలాగే ఈ నేల 8వ తేది ఢిల్లీలో జరిగిన ''జపానిస్ షాటోకన్ కరాటే డూ పెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్ చీఫ్ '' సెకండ్ ఏసియాన్ ఇంటర్ నేషనల్ ఛాంపియన్ 2022 గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ రాష్టానికి, ఎంతో పేరుతేచ్చింది.వరుసగా అనేక రాష్ట్రల లో గోల్డ్ మెడల్స్ సాధించిందన్నారు.అదే తరుణంలో తెలంగాణ రాష్టం తరుపున 21వ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ చీఫ్ 2022 కుహులలుంపర్, మలేషియాలో ఈనెల తేది 17,18,19వతేదీలలో జరిగే పోటీలకు ఎంపిక కావడంతో పలువురు హార్షం వ్యక్తం చేశారు.కానీ నిరుపేద కుటుంబం అయినందున మలేషియా పోవడానికి పాస్ పోర్ట్ ,ఆర్థికస్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు.చిన్నవయస్సులో అవకాశం వచ్చినా అందని ద్రాక్షాగా వున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరన్నా దాతలు ముందుకొస్తే ఆమె రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తానని ఆవేదన చెందింది.దయచేసి బొల్లెద్దు హారికకు సెల్ 8121905335కు ఫోన్పేగానీ, గూగుల్ పే కానీ పంపి ప్రోత్సాహకం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాబు, ఉపేందర్, యేసుపాదం, వెంకన్న, కళింగరెడ్డి,జానయ్య, బాలాజీ పాల్గొన్నారు.