Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 3వ వార్డులో రూ.20లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు,20వ వార్డులో రూ 20లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు 39వ వార్డులో నిర్వహించిన పారిశుధ్యపనుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.పట్టణాలను పరిశుభ్రంగా ఉంచు కునేందుకు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కెేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 15 రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయా వార్డుల ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు అధి కారుల దష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని సమస్యలు లేని పట్టణాన్ని రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపుతూ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు రవినాయక్, అన్నెపర్తి రాజేష్,మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల పాటి భరత్మహాజన్, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు,శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,వార్డుల అభివద్ధి కమిటీ సభ్యులు, వార్డు జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్
తిరుమలగిరి : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మున్సిపాలిటీపరిధిలోని మాలిపురం 6వ వార్డులో పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ రజనిరాజశేఖర్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పర్యావరణం కలుషితం అవుతుందని, మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కుదురుపాక శ్రీలత రాములు వార్డ్ అధ్యక్షులు జంపాల కనకయ్య, మాజీ సర్పంచ్ రాములు , మండలనాయకులు రాములు, వీరయ్య, బిల్ కలెక్టర్ ఉమేష్, విష్ణు, క్రాంతి, అజరు తదితరులు పాల్గొన్నారు.