Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెప్రగతితో గుణాత్మకమైన మార్పు
- రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-చివ్వెంల
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.ఆదివారం ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూరు గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా హాజరయ్యారు.ముందుగా గ్రామంలోని అభివద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేస్తూ సంబందించిన సిబ్బందిని, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా కోటి 30 లక్షలతో పాఠశాల అభివద్ధి పనులకు శంకుస్థాపన, రూ.4.75 లక్షలతో చేపట్టిన గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం,డంపింగ్ యార్డ్, పల్లె ప్రకతివనం తదితర స్థలాల సందర్శన చేశారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి తో గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆత్మకూర్ యస్ మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన పల్లెప్రగతిలో సహచర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హాజరయ్యారు.మంత్రులుఅధికారులతో కలిసి పాదయాత్రనిర్వహించి ప్రజల బాగోగులపై వాకబు చేశారు.మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరు అయిన కోటి ముప్పై లక్షల మొత్తంతో నిర్మించ తలపెట్టిన పాఠశాల భవనానికి మంత్రులు శంకుస్థాపన జరిపారు.అదే విదంగా గ్రామంలో రూ.4.75 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు డంపింగ్ యార్డ్, పల్లెప్రకతివనాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి. వినరు కష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సీఈఓ సురేష్, డిపిఓ యాదయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.