Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.ఆదివారం గొట్టిముక్కుల రిజ్వాయర్ కింద భూమి, ఇండ్లు కోల్పోయిన లింగన్నభావి, పుతాలరాం తండాలకు చెందిన 110మందికి ఇండ్ల ధ్రువీకరణపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి గేట్ వద్ద ఆర్అండ్ఆర్ సెంటర్లో రూ.2.76కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ , అంగన్వాడీ భావనం, వాటర్ ట్యాంకుల నిర్మాణపనులు జరుగుతున్నాయని తెలిపారు.గొట్టిముక్కుల రిజర్వాయర్ కింద ముంపునకు గురైన కుటుంబాలకు అన్ని వసతులు కల్పించనున్నట్టు తెలిపారు.పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు, వద్ధులకు తదితరులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, ఆర్డీవో గోపిరాం, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతుబంధుమండల అధ్యక్షులు సిరందాసు కష్ణయ్య, తహసీల్దార్ కిరణ్మయి, అయ్యన్న బాద్యానాయక్, బొడ్డుపల్లి కష్ణ పాల్గొన్నారు.