Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
పట్టణంలోని ఎన్నెస్పీ కెనాల్ వెంట గల ఇండ్ల నిర్మాణాల తొలగింపులో అనుసరించిన విధానం సరికాదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం హుజూర్‌నగర్‌లోని రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌లో నిర్వహించిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే నియంతత్వవిధానాలను అమలు చేస్తూ పేదల ఇండ్ల విషయంలో కూడా వారికి అన్యాయం చేశారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా తన అను చరులతో కలిసి అన్యాయాలు,అక్రమాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు.నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ తగిన న్యాయం చేసే వరకు పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,తన్నీరు మల్లికార్జున్‌రావు, కోతి సంపత్‌రెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, నాగారపుపాండు, సీపీఐ నాయకులు పాలకూరి బాబు, ఎల్లావుల రాములు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నాయకులు నల్లమాద శ్రీనివాస్, బెల్లంకొండ రామజోగి, టీజేఎస్ నాయకులు భిక్షం, న్యూడెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు.