Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ బాలికపై జరిగిన దారుణ సామూహిక లైంగిక ఘటన ఖండిస్తూ, అఖిలభారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరం నడి రోడ్డుపై పట్టపగలు ఈ దారుణం జరగడం పాలనా వ్యవస్థ వైఫల్యం అని మహిళల రక్షణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావతం అవుతున్నాయన్నారు. ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు మనవడు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని నిష్పక్షపాతంగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలోమౌనిక, శైలజ, నాగమణి, శ్రీదేవి, రాములమ్మ, సోనీ, నాగమ్మ, ప్రియాంక, పద్మ, అరుణ వీరమ్మ, పూలమ్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు.