Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
ఈనెల 19, 20వ తేదీలలో హాలియాలో జరగనున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా 8వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఆదివారం హాలియా మండలకేంద్రంలోని సుందరయ్య భవన్లో మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా మండల గ్రామ మహాసభలు పూర్తిచేసుకొని 300 మంది ప్రతినిధులతో హాలియా లో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమం అభివద్ధికి అనేక పథకాలు వాగ్దానాలు చేసి నేడు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని అన్నారు.మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలగా మిగిలిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీలు ఇండిస్టియల్ సబ్సిడీలు అందడం లేదన్నారు. జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీనులి మాట్లాడుతూ దళిత బంధు పథకం మొదటి విడతగా నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటుందని రెండో విడతలో నియోజకవర్గానికి 5000 వేల మంది దళితులకు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో సమస్యలపై చర్చించి పెద్దఎత్తున ఆందోళన పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, దోరేపల్లి మల్లయ్య, వింజమూరి శివ, మేకల వెంకన్న, జానయ్య, పొదిల వెంకన్నలి తదితరులు పాల్గొన్నారు.