Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
అక్రమంగా చెరువు మట్టి తరలిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని చెరువులోని మట్టిని ఇటుక బట్టీల వ్యాపారులు అనుమతులు లేకుండా తరలిస్తున్నారన్నారు.ప్రతిరోజు రాత్రి, పగలు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా భారీ ఎత్తున మట్టి డంపింగ్ చేస్తున్నారన్నారు.బట్టి యజమానులు కొందరు అనుమతులకు మించి మట్టిని తరలిస్తుండగా మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిదోపిడి చేస్తున్నార న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. లక్షలాది రూపాయలు ప్రభుత్వా ఆదాయానికి గండి కొడుతు న్నారన్నారు.ఐబీ,మైనింగ్ అధి కారులు బట్టి వ్యాపారులతో కుమ్మక్కై మట్టిదందా చేస్తున్నా రన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రణీత్‌రెడ్డి సైదులు, రమేష్, కోడిరెక్క వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.