Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి తీర్మానాలపై ప్రశ్నించినందుకు రెండవ వార్డు కౌన్సిలర్ హనుమంతు అరెస్ట్
నవతెలంగాణ-తిరుమలగిరి
తమ పార్టీకి చెందిన తిరుమలగిరి మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ హనుమంతుపై మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు సుమారు రెండు గంటలపాటు నిరసన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పదో వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు మొగుళ్ళ జితేందర్ మాట్లాడుతూ. తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్,చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తూ పట్టణ ప్రగతిపై ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించకుండా పనులు నిర్వహిస్తున్నారని ఈ విషయమై ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ పై కావాలనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంవత్సరానికొకసారి సమావేశం నిర్వహిస్తూ మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా అమలు చేయడం లేదన్నారు.నిధులు లేకుండా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారన్నారని ప్రశ్నించారు.మొక్కల పెంపకం పేరుతో సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు నకిలీ బిల్లులు పేరుమీద చేశారని ఆరోపించారు.దీంతో పాటు మరో ఏడు కోట్ల రూపాయల పనులు చేసిన పర్సెంటేజీలు ఇవ్వకుంటే బిల్లు నిలిపివేశారని ఆరోపించారు.మున్సిపల్ కార్యాలయంలో అవినీతిగా మారిందన్నారు.తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ టీిఆర్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ కాంగ్రెస్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన చేస్తున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ లోకాయుక్త కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. మున్సిపల్ కమిషనర్‌ను అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా పట్టణప్రగతి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.ఎలాంటి జీవో లేకుండా పట్టణ ప్రగతి కార్యక్రమంలో సిబ్బందిచే పనులు చేయిస్తూ బిల్లు ఇస్తున్నారని ఆరోపించారు. పట్టణప్రగతిలో నిధులు లేకుండా పనులు ఎలా సాధ్యమవుతాయన్నారు.కేవలం సిబ్బందిచే నామమాత్రంగా పనులు చేస్తున్నారన్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తిరుమలగిరి మున్సిపాలిటీ అక్రమాలపై అవినీతిపై విచారణ జరపాలని కోరారు.తమ వార్డు కౌన్సిలర్ హనుమంతుపై ఎలాంటి కారణం లేకుండా మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం అమానుషమన్నారు.ఈ కేసును ఎత్తివేయాలి లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.అనంతరం తిరుమలగిరి ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో నాగారం ఎస్ఐ ముత్తయ్య,అర్వపల్లి ఎస్సై అంజిరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు సంకేపల్లి కొండల్‌రెడ్డి, గంటా భిక్షంరెడ్డి, మూల రవీందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దయాయాదవ్. కాంగ్రెస్ కౌన్సిలర్ చిర్రబోయిన హనుమంతు,ఒకటో వార్డు కౌన్సిలర్ భాస్కర్‌నాయక్, కట్కూరి రమేష్, ఆకులఎల్లయ్య, నర్సింహ, ఎస్కె యాకుబ్‌పాషా, శ్రీశైలం, గణేష్, స్వామి, కిరణ్, కొమురయ్య, రాజు పాల్గొన్నారు.