Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కబడ్డీ క్రీడాకారులకు అన్ని వేళలో సహాయ సహకారాలు అందిస్తానని కబడ్డీ అసోసియేషన్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు అన్నారు.సోమవారం పట్టణంలో తమ గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్లో కబడ్డీ క్రీడల్లో శిక్షణ పొంది గత నెలలో యానంలో జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియా (యానాం) కు ఎంపికైన అమీనాబాద్ కు చెందిన క్రీడాకారుడు ఎం గోపీకి అభినందించి మాట్లాడారు.మారుమూల గ్రామీణ ప్రాంతంలో జన్మించి కబడ్డీ క్రీడపై ఆసక్తి తో తమ వద్ద శిక్షణ పొంది ఉన్నతస్థాయికి ఎదగడం హర్షణీ యమన్నారు.క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అగ్రస్థానంలో ఉందన్నారు. గతంలో అనేక మంది క్రీడాకారులు తమ వద్ద శిక్షణ పొంది జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు.అనంతరం గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ నుండి క్రీడాకారుడు గోపీకి ఐదు వేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు.భవిష్యత్లో అన్ని రకాల సహకారం ఉంటుందని క్రీడాకారునికి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సబ్యులు నాగిరెడ్డి ,ముస్తఫా నాగరాజు ,సంతోష్ ,వినరు, వేణు, సైదులు మధు ,నవీన్ పాల్గొన్నారు.