Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
సర్వీస్ రోడ్డు వెంట వున్న డ్రయినేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్ కోరారు.ఈ మేరకు ఆదివారం జీఎంఆర్ సంస్థ కొర్లపహాడ్ ప్రాజెక్టు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగాల జాతీయ రహదారి వెంట జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. కాల్వల నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు మరమ్మతులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు .ఫలితంగా కాల్వలో చెత్తాచెదారం మట్టి పేరుకుపోయి మురుగునీరు బయటకు వెళ్ళడం లేదని గుర్తుచేశారు.అనేక చోట్ల డ్రయినేజీపై వేసిన సిమెంట్బండలు విరిగిపోయాయన్నారు.గ్రామ పంచాయతీ పరధిలో రహదారి వెంట ఏర్పాటు చేసిన వీధిదీపాలు కూడా వెలగడం లేదని తెలిపారు.ఈ విషయమై పలుమార్లు అధికార్ల దష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదని తెలిపారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఉపసర్పంచ్ ఎల్.వెంకయ్య, వార్డు సభ్యులు ఉన్నారు.